Minister Dola Shri Bala Veeranjaneya Swamy said that YCP misinformation about free gas cylinders is shameful.
- ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం
-
పాల్గొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్.. కలెక్టర్ -
కూటమి సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి - సంక్షేమం దిశగా ముందుకు సాగుతోంది- మంత్రి
-
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం -
సబ్సిడీ కింద ప్రకాశం జిల్లాలో మహిళలకు 41 కోట్లు చెల్లిస్తున్నాం- మంత్రి డోలా -
ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసిపి దుష్ప్రచారం సిగ్గుచేటు- మంత్రి.

ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియాలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.
దీపం పథకం కింద రాష్ట్రంలో కోటి 43 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సబ్సిడీ కింద ప్రకాశం జిల్లాలో మహిళలకు రూ. 41 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమవుతుందని మంత్రి తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని.. టిడ్కో ఇళ్లు త్వరలో లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేపటి నుంచి గుంతలు లేని రోడ్ల కార్యక్రమం ప్రారంభించి త్వరలోనే అన్నీ రోడ్లు రిపేర్లు పూర్తి చేస్తామని మంత్రి స్వామి తెలిపారు.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు.