Leading News Portal in Telugu

A young couple wife has gone missing in Rajampet of Annamayya district.


  • రాజంపేటలో యువ దంపతుల్లో భార్య అదృశ్యం

  • వెంకటగిరి మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన వెల్లూరు రాజా (22).. భార్య పెంచలమ్మ (20)

  • దీపావళి పండుగకు అత్తగారి ఇంటికి బయల్దేరిన దంపతులు.
Annamaya District: రాజంపేటలో యువ దంపతుల్లో భార్య అదృశ్యం..

అన్నమయ్య జిల్లా రాజంపేటలో యువ దంపతుల్లో భార్య అదృశ్యం అయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన భర్త వెల్లూరు రాజా (22), భార్య పెంచలమ్మ (20).. దీపావళి పండుగ కోసమని అన్నమయ్య జిల్లా చిట్వేలులోని అత్తగారి ఇంటికి వెంకటగిరి నుంచి బయల్దేరారు. అయితే.. రాపూరు బస్టాండ్ నుంచి బస్సులో ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న ఒక్క అపరిచిత వ్యక్తితో దంపతులు రాజంపేట పాత బస్టాండ్‌లో దిగారు.

అక్కడ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సమీప మామిడి తోపుల వద్దకు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అనంతరం భర్త వెల్లూరు రాజాకు భార్య పెంచలమ్మ కనిపించలేదు. ఈ క్రమంలో.. భార్య మరో వ్యక్తితో కలిసి నెల్లూరు బస్సులో వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా రాజంపేట పోలీసులు గుర్తించారు. దీంతో.. భార్య పాత్ర పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.