- రెడ్ బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయి- మంత్రి లోకేష్
-
త్వరలో మూడో చాప్టర్ కూడా ఓపెన్ అవుతుంది- లోకేష్ -
చట్ట వ్యతిరేకంగా పని చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం- మంత్రి.

ఇటీవలే మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ క్రమంలో.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రెడ్ బుక్‌లో రెండు చాప్టర్ ఓపెన్ అయ్యాయని.. త్వరలో మూడో చాప్టర్ కూడా ఓపెన్ అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. చట్ట వ్యతిరేకంగా పని చేసిన వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదని వారికి కచ్చితంగా సినిమా చూపిస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయంలో తాను కూడా బాధితుడినేనని మంత్రి లోకేష్ తెలిపారు.
రెండో చాప్టర్‌తోనే ఆగిపోను.. అతి త్వరలోనే మూడో చాప్టర్ కూడా ఓపెన్ చేస్తానని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. రెడ్ బుక్కు భయపడి జగన్ గుడ్ బుక్ తీసుకొస్తా అంటున్నాడు. ఆ బుక్‌లో ఏం రాయాలో అర్ధం కావడం లేదని మంత్రి సెటైర్లు వేశారు. అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.