Leading News Portal in Telugu

Minister Vangalapudi Anitha will visit the victim’s family in Vadamalapeta in Tirupati District


  • తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..హత్య
  • చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న హోంమంత్రి అనిత
  • బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
  • చెక్కును స్వయంగా అందజేయనున్న హోంమంత్రి
Minister Anitha: మూడేళ్ల బాలికపై హత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న హోంమంత్రి

Minister Vangalapudi Anitha: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత ఆదివారం పరామర్శించనున్నారు . అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబాన్ని కలిసి స్వయంగా ఆమె భరోసా అందించనున్నారు . మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా చెక్ ను అందజేయనున్నారు.

తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. ఇక, రేపు మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు.