Leading News Portal in Telugu

Union Minister Rammohan Naidu Comments on YS Jagan


  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు
  • శ్రీకాకుళం జిల్లాలో ఐదేళ్లలో రూపాయి ఖర్చు చేయలేదని విమర్శలు
Rammohan Naidu: నాగావళి – వంశధారను అనుసందానం చేస్తాం..

Rammohan Naidu: గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత ఐదేళ్లలో రూపాయి ఖర్చు చేయలేదన్నారు. 2019లో ఏ స్టేజ్‌లో ప్రాజెక్టులు ఉన్నాయో నేడు అదే పరిస్దితి ఉందన్నారు. వంశధార ఫేజ్ 2 పూర్తి చేస్తామన్నారు. నాగావళి – వంశధార అనుసంధానం చేస్తామన్నారు.

ఆప్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వలసలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మూలపేట పోర్టు సమీపంలో పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఇండస్ర్టియల్ అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నామని తెలిపారు. బీచ్ శ్యాండ్ ద్వారా టైటానియం ఇండస్ర్టీ డెవలప్ చేస్తామన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే మూలపేటను ‌కొనసాగిస్తున్నామని చెప్పారు. మూలపేట సమీపంలో ఎయిర్‌పోర్టు సిద్ధం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.