Leading News Portal in Telugu

Attack on Macharla MLA Julakanti Brahmareddy’s brother-in-law in Guntur


  • జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిదిపై దాడి
  • ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు దాడి
Guntur: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిదిపై దాడి

Guntur: గుంటూరు శ్యామలా నగర్‌లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై దాడి జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కొంతమంది యువకులు కర్రలు రాడ్లతో వాహనాలపై దాడి చేశారు. దాడిలో కృష్ణారెడ్డితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బిల్డర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు , అతని కుమారుడిపై ఎమ్మెల్యే బావమరిది కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.