Leading News Portal in Telugu

Ex Minister Roja Shocking Comments On CM Chandrababu, Pawan Kalyan


  • చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదు
  • ఇది ఈవీఏం ప్రొడక్షన్ వారి సీబీఎన్‌ ప్రభుత్వం
  • సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్
  • మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు
RK Roja: సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

RK Roja: మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోంమంత్రి అనితా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వీటిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని అడిగారు. చంద్రబాబును ఈ జిల్లా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామన్నారు. సూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ అన్న మనకు అండగా నిలవాలి, తప్పుడు ప్రచారం వల్ల వైసీపీ ఓడిపోయిందన్నారు. చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదన్నారు. ఇది ఈవీఏం ప్రొడక్షన్ వారి సీబీఎన్‌ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

రెడ్ బుక్ అంటూ మీ కొడుకు ఏవిధంగా వేధిస్తున్నాడో ప్రజలు చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడన్నారు. సంక్షేమ పథకాలు లేవు, విజయవాడ నగరాన్ని చంద్రబాబు నీట ముంచేశారని ఆరోపించారు. పులిహోర పొట్లాలకు 360 కోట్లు ఖర్చు చేసి దోచుకున్నారన్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు విష ప్రచారం వల్లనే ఓటమి చెందామన్నారు. ఈ రాక్షస పాలనను అంతం చేయాలన్నారు. ఈరోజు నుంచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకువెళదామని వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ప్రశ్నించే పార్టీ అని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తొక్కి నారతీస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్‌కు ప్రజలే నొక్కి తాట తీస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కృషి చేయాలన్నారు.