Leading News Portal in Telugu

Vijayasai Reddy said that YCP is opposing the Waqf Amendment Bill.


  • విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభ

  • పాల్గొన్న వైసీపీ నేత విజయ సాయి రెడ్డి

  • ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోంది

  • వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారు- విజయసాయి రెడ్డి.
Vijayasai Reddy: వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకం..

విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు. ఈ బిల్లును క్యాబినెట్‌లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ఏ మంత్రి విబేధించినా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సి ఉంటుంది.. కానీ ఈ బిల్లుని రామ్మోహన్ నాయుడు ఆమోదించారని విజయసాయి రెడ్డి తెలిపారు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైసీపీ వ్యతిరేకించింది.. వైసీపీ తరఫున తాము డీసెంట్ నోట్ కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ముస్లింల తరఫున వైసీపీ ఎప్పుడూ నిలపడే ఉంటుందని తెలిపారు.

Guruprasad: అప్పులబాధతో స్టార్ డైరెక్టర్ సూసైడ్.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో.. ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది.. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైసీపి వ్యతిరేకమన్నారు. అలాగే.. రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది.. ఆ భూముల్లో చాలాభాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పని చెప్పారు. కుట్ర పూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు.. ఈ ఆరోపణలను వైసీపి ఖండిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. వక్ఫ్ బోర్డు భూములే 50% ఆక్రమణలకు గురయ్యాయి.. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.

Black Magic: ఎన్టీఆర్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు.. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని విజయసాయి అన్నారు. ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని.. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు, ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలా అన్యాయమన్నారు. అలాగే.. వక్ఫ్ బోర్డు సీఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు.. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే తాము సహించమని.. జగన్ ఆదేశాలతో తాము ముస్లింల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు.