Leading News Portal in Telugu

Ex minister Gudivada Amarnath has criticized the coalition government.


  • కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు

  • చంద్రబాబు టూర్లో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదు- అమర్నాథ్

  • సూపర్ సిక్స్ అన్నారు సింగిల్ రన్ కూడా తీయలేదు- అమర్నాథ్

  • ఇంకా ఎప్పుడు సూపర్ సిక్స్ కొడతారు- గుడివాడ అమర్నాథ్.
Gudivada Amarnath: సూపర్ సిక్స్ అన్నారు.. సింగిల్ రన్ కూడా తీయలేదు.. మాజీ మంత్రి విమర్శలు

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పర్యటనలో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదని అన్నారు. అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు.. సీఎం చంద్రబాబే తాము కట్టిన కట్టడాన్ని మెచ్చుకున్నాడని అన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టించి జగన్ కోసం కట్టుకున్న ప్యాలెస్‌గా చెప్తున్నాడని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు తాత్కలింగా అమరావతిలో నిర్మిస్తే జగన్ శాశ్వత అద్భుత భవనాల్ని నిర్మించారన్నారు. అమరావతిలో రూ.1100 కోట్లు ఖర్చు పెట్టి టెంపరరీ భవనాలు కట్టారు.. చంద్రబాబు కట్టిన భవనాల్లో వర్షం వస్తే నేరుగా ఛాంబర్ లోకి నీరు వచ్చేదని ఆయన పేర్కొన్నారు. కానీ జగన్ పర్మినెంటిగా ఋషికొండలో భవనాలు నిర్మించారని తెలిపారు.

తాను మంత్రిగా ఉన్నప్పుడు తన ఛాంబర్‌లో బాత్ రూమ్ కి వెళ్ళే పరిస్థితి లేదు.. అలాంటి కట్టడాలు చంద్రబాబు కట్టాడని విమర్శించారు. అమరావతిలో కట్టిన భవనాల్ని, జగన్ కట్టిన భవనల్ని ప్రజలకు చూపించండి అని అన్నారు. ఏ భవనాలు పర్మినెంట్‌గా కట్టారో ప్రజలే చెబుతారని పేర్కొన్నారు. ప్రభుత్వంకు సంబంధించిన టూరిజం ప్లేసులో జగన్ ఎలా సొంతంగా భవనాలు కట్టుకుంటారు.. ప్రజల్ని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు.. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పోలవరం పనులు తమ హయాంలో ఎక్కువుగా జరిగితే ఏమి కాలేదు అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాత్కాలిక భవనాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన మీరు. జగన్ తక్కువ ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మిస్తే ఎందుకు ఏడుస్తున్నారని దుయ్యబట్టారు.

సూపర్ సిక్స్ అన్నారు సింగిల్ రన్ కూడా తీయలేదు, ఇంకా ఎప్పుడు సూపర్ సిక్స్ కొడతారని ఎద్దేవా చేశారు. నాన్నకి ఇంధనం దొరికింది తప్ప.. అమ్మకి వందనం దక్కలేదని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. బార్లలో తగ్గింపు ధరలకే మద్యం అని బ్యానర్ లో కట్టారు.. కానీ పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గింపు ధరల బ్యానర్లు ఎక్కడ కనిపించవేనని అన్నారు. మీరు ఏమి పరిపాలన చేస్తున్నారు.. ఇప్పటికీ జగన్ మీద పడి ఏడుస్తున్నారు, ఏడుపు ఆపి ప్రజలకి న్యాయం చేయండని తెలిపారు. మీరు చేసిన దుబారా ఖర్చులతో పోల్చితే.. తాము రుషికొండలో నిర్మించిన శాశ్వత భవనాలు మంచివే కదా అని పేర్కొన్నారు. గుంతలు ఉన్న రోడ్లని కప్పడం మానేసి బాగున్న రోడ్లను తవ్వి కప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం మానేసి.. తమ పై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.