Leading News Portal in Telugu

Home Minister Vangalapudi Anitha visited the parents of the child who was murdered in Vadamalapeta.


  • వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన హోంమంత్రి అనిత

  • రూ. 10 లక్షల చెక్కును‌ అందించిన హోంమంత్రి అనిత

  • చిన్నారిపై అఘాయిత్యం బాధేసింది- అనిత

  • చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్యచేయడం మరింత బాధించింది- హోంమంత్రి.
Vangalapudi Anitha: వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన హోంమంత్రి..

తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం వారికి.. పది లక్షల చెక్కును‌ అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్నారిపై అఘాయిత్యం బాదేసింది.. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్య చేయడం మరింత బాధించిందని తెలిపారు. అలిమేలు మంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. చిన్నారి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని హోంమంత్రి పేర్కొన్నారు. ఘటన జరిగిన తరువాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశాం.. పోలీసులు వెంటనే స్పందించారు.. మద్యం మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడని అన్నారు.

UP: లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్లు.. వారిని బంధించి చితక బాదిన గ్రామస్థులు (వీడియో)

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం.. ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పచెబుతాం.. మూడు నెలల్లో నిందితుడిని శిక్షిస్తామని హోంమంత్రి తెలిపారు. గత ఐదేళ్ళలో పోలీసు వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసింది.. ఈ ఘటనను రాజకీయం చేయడం విడ్డూరం అని దుయ్యబట్టారు. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది.. చిన్నపిల్లల మరణాల్ని వైసీపీ రాజకీయం చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద చల్లొద్దు.. క్రైం రికార్డు చూస్తే గత ఐదేళ్ళలో ఎన్నో ఘటనలు జరిగాయి.. పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే జగన్ ఎందుకు నిందితుడిని శిక్షించలేదని ప్రశ్నించారు.

Yogi Adhityanath: సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు

రాష్ట్రంలో సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం.. దిశ యాప్ అంటూ రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని హోంమంత్రి అన్నారు. చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డగా చూస్తున్నారు.. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వద్దు.. జగన్ చేష్టలను దేవుడు కూడా క్షమించడని ఆరోపించారు. వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారింది.. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.