Leading News Portal in Telugu

Ex minister Perni Nani criticized Chandrababu and Pawan Kalyan.


  • వైసీపీకి ఆధారం.. మూలం
  • బలం కార్యకర్తలు మాత్రమే- పేర్ని నాని

  • జగన్ జెండా మోస్తూ జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు కార్యకర్తలు జై కొడతారు- నాని

  • జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదు- పేర్ని నాని

  • మోడీ.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు- పేర్ని నాని.
Perni Nani: వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలే..

వైసీపీకి ఆధారం.. మూలం, బలం కార్యకర్తలు మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ జెండా మోస్తూ.. జై కొట్టినంత సేపు మాత్రమే నాయకులకు, కార్యకర్తలు జై కొడతారన్నారు. జెండా వదిలితే మాత్రం ఆ నాయకుడు కార్యకర్తకు అవసరం లేదని చెప్పారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. కేసులు పెట్టారు, రోడ్ల మీద కొట్టారు, దౌర్జన్యాలు చేశారని అన్నారు. ఓవర్ యాక్షన్ చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టం.. వాళ్లని పరిగెత్తించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

అధికార మధంతో వైసీపీని అణగదొక్కాలని చూస్తున్నారు.. సోషల్ మీడియాలో వైసీపీకి ఫెవర్ పోస్టులు పెడుతుంటే వారిని టార్గెట్ చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. జగన్‌ను ప్రేమించడం, ఆగిపించడం జరగని పని.. జగన్ వ్యక్తిత్వాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమాలకి రారు.. ఆయన చెప్పే నీతులు మాత్రం గురివింద గింజ సామెతలు అని విమర్శించారు. అధికారం ఉన్నా లేకపోయినా.. శత్రువులతో పోరాడేది వైసీపీ కార్యకర్తలేనని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ జెండాలు మోయటానికి కూలీ ఒప్పుకున్న కూలీలను కొడుతున్నారు.. జనసేన కార్యకర్తలు మానసికంగా చచ్చి బ్రతుకుతున్నారని ఆరోపించారు.

జగన్‌ను ఓడిస్తే మనకు మంచి జరుగుతుంది అనుకున్నారు.. ఇప్పుడు పల్లకిలు మోపిస్తున్నారని పేర్ని నాని తెలిపారు. జనసేన కార్యకర్తల పరిస్థితి పగోడికి కూడా రాకూడదు.. మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చిన ఏమి అవ్వదని ఆరోపించారు. తగ్గేదేలా అని హెచ్చరిస్తున్నాం.. మూడవ పేజీ కాదు ముప్పైవ పేజీ అయిన తెరుసుకో ఏం జరగదని రెడ్ బుక్ పై విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.