Leading News Portal in Telugu

AP TET Result 2024 Declared, 1.87 lakh Candidates Qualified


  • ఏపీ టెట్ ఫలితాలు విడుదల..

  • ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి నారా లోకేష్..

  • త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తాం: మంత్రి లోకేష్
AP TET Results 2024: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. 1.87 లక్షల మంది క్వాలిఫై

AP TET Results 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా తెలిపారు. ఏపీ వ్యాప్తంగా టెట్‌కి 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. అందులో 86.28 శాతం మంది హాజరు కాగా.. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారన్నారు. మొత్తం 1,87,256 మంది అర్హత సాధించినట్లైంది అని మంత్రి చెప్పుకొచ్చారు. కాగా ఈ ఫలితాలను https://cse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

అయితే, రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేశామన్నారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామన్నారు. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ నా శుభాకాంక్షలు అని నారా లోకేష్ చెప్పారు.