Leading News Portal in Telugu

List Of Events In The Month Of November In Tirumala


  • తిరుమలలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాలు..

  • 5వ తేదీన నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహన సేవ..

  • 8వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ..

  • 13వ తేదీన కైసిక ద్వాదశి నాడు ప్రత్యేకంగా ఆస్థానం..
Events in November at Tirumala: ఉత్సవాల సీజన్‌గా నవంబర్‌.. తిరుమలలో విశేష కార్యక్రమాలు ఇవే..

Events in November at Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాల సీజన్ గా మారిపోయింది. తిరుమలలో నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణా నక్షత్రంతో పూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజులు పాటు స్వామివారు 16 వాహనాలపై తిరుమల మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే తరహలో నవంబర్ మాసంలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.

నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు..
* నవంబర్ 5 – నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
* నవంబర్ 6 – శ్రీ మణవాళ మహాముని శాత్తుమొర
* నవంబర్ 8 – వార్షిక పుష్పయాగం కోసం అంకురార్పణం
* నవంబర్ 9 – శ్రీవారి పుష్పయాగం , అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్ళైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పుడత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర
* నవంబర్ 10 – పెయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
* నవంబర్ 11 – శ్రీ యాజ్ఞవల్క్య జయంతి
* నవంబర్ 12 – ప్రబోధన ఏకాదశి
* నవంబర్ 13 – కైశిక ద్వాదశి ఆస్థానం , చాతుర్మాస్య వ్రతం ముగుస్తుంది
* నవంబర్ 15 – కార్తీక పౌర్ణమి
* నవంబర్ 28 – ధన్వంతరి జయంతి
* నవంబర్ 29 – మాస శివరాత్రి