- ఏపీ శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల
- నోటిఫికేషన్ను జారీ చేసిన గవర్నర్
- ఈ నెల 11 నుంచి సమావేశాలు

AP Assembly: ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ , శాసన మండలి సమావేశాల నోటిఫికేషన్ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 11 తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం అవుతాయని నోటిఫికేషన్లో రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.