Leading News Portal in Telugu

AP Government Constituted Ministers Committee on Drugs in the State


  • ఏపీలో నార్కోటిక్ డ్రగ్స్..గంజాయి నియంత్రణ..నిర్మూలనపై మంత్రుల కమిటీ
  • అధ్యయనం చేయాలని కమిటీకి ఆదేశాలు
Andhra Pradesh: నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి నిర్మూలన, నియంత్రణపై మంత్రుల కమిటీ ఏర్పాటు

Andhra Pradesh: ఏపీలో నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం నివారణ, డ్రగ్స్, మద్యం బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్, మానవ వనరుల, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి రవాణా, నిర్మూలన, నియంత్రణపై అధ్యయనం చేయాలని కమిటీకి ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రగ్స్, గంజాయి, మద్యం బానిసైన వారికి డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటన్నింటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.