Leading News Portal in Telugu

Key Discussion in AP Cabinet on posts on Social Media


  • సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ
  • చర్చను లేవనెత్తిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • పోస్టులు పెడుతున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపాటు
AP Cabinet: సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ

AP Cabinet: సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చను లేవనెత్తారు. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని పవన్‌ కల్యాణ్ కేబినెట్‌ సమావేశంలో పేర్కొన్నారు. కొంత మంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారన్నారు. ఇలా అయితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా రియాక్టు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంట్లో మహిళల పైనా పోస్టులు పెడితే ఊరుకోవాలా?…అందువల్లే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.