- విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్
- ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును రద్దు చేసిన ఏపీ హైకోర్టు
- హైకోర్టు తీర్పుతో నిలిచిపోనున్న విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక

Vizianagaram: విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్‌పై మండలి ఛైర్మన్ తీసుకున్న అనర్హత వేటును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనర్హత చర్యలను ఇందుకూరి రఘురాజు గతంలోనే హైకోర్టులో సవాలు చేశారు. నేడు తుది తీర్పు సందర్భంగా అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2027 నవంబర్ చివరి వరకు ఎమ్మెల్సీగా రఘు రాజు కొనసాగ వచ్చని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిచిపోనున్నాయి.