Leading News Portal in Telugu

Mumbai actress Kadambari Jethwani Case will be heard in High Court and CID court today


  • ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో నేడు కీలక విచారణ..

  • హైకోర్టు.. సీఐడీ కోర్టులో విచారణ..
Kadambari Jethwani Case: ముంబై నటి జత్వాని కేసు.. నేడు కీలక పిటిషన్లపై విచారణ

Kadambari Jethwani Case: ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ సాగనుంది.. ముంబై సినీనటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది.. గత విచారణలో నేటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే కాదు.. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతిరానా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు.. ఇదే కేసులో ఇంప్లిడ్ అయ్యారు జత్వాని.. అయితే, నేడు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు.

మరోవైపు.. ముంబై నటి జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్ పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది.. వారం రోజులు విద్యాసాగర్ ను కస్టడీ కోరారు పోలీసులు.. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తునకు పూనుకున్న పోలీసులు.. జత్వానీ కేసులో A1 నిందితుడిగా ఉన్న విద్యాసాగర్‌ను తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమయ్యారు.. దీనికోసం సీఐడీ కోర్టును ఆశ్రయించారు.. అయితే, పోలీసుల పిటిషన్‌పై ఈ రోజు సీఐడీ కోర్టులో విచారణ సాగనుంది..