Leading News Portal in Telugu

Home Minister Vangalapudi Anitha Serious Comments on YS Jagan


  • హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
  • గత ప్రభుత్వ హయాంలో పోలీసులను పని చేయనివ్వలేదు
  • మేం చేస్తున్న అరెస్టులు తప్పు కాదు.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు
  • ప్రచారంపై ఉగ్రవాదుల కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాలి
Minister Anitha: సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా.. హోంమంత్రి సీరియస్

Home Minister Vangalapudi Anitha: పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు. మేం ఏరోజూ మిమ్మల్ని అడ్డుకోలేదన్నారు. ఇప్పుడు మీ ఆఫీసుల మీద దాడులు జరగలేదే అంటూ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మాది ప్రజారంజక పరిపాలన.. 28 శాతం క్రైం రేట్ తగ్గిందన్నారు. రాజకీయ లబ్ధికోసం అభంశుభం తెలీని ఆడపిల్లల విషయంలో మాట్లాడొద్దన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులను పని చేయనివ్వలేదని విమర్శించారు. మేం చేస్తున్న అరెస్టులు తప్పు కాదని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ప్రచారంపై ఉగ్రవాదుల కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకోవాలన్నారు.

ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడానికి వార్ రూం ఏర్పాటు చేస్తారట..భావ స్వేచ్ఛా ప్రకటనకి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నారు. సోషల్ మీడియాను ఉగ్రవాదుల కంటే ఎక్కువగా తీసుకోవాలన్నారు. పేట్రేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడితే ఎవరినీ వదలమని హెచ్చరించారు. దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావడానికి సిద్ధమయ్యామని చెప్పారు. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసు తలెత్తుకు తిరిగేలా‌ చేస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో బరి తెగించే వాళ్ళు లేరన్నారు. నా మీద జాలి ఎందుకు కానీ… చాలామంది ఉన్నారు జాలి పడాల్సిన వారు ఉన్నారన్నారు. టీడీపీ వాళ్ళు పోస్టులు పెట్టినా కూడా వదలమన్న హోంమంత్రి.. మహిళ ఎవరైనా మహిళేనని స్పష్టం చేశారు.