Leading News Portal in Telugu

CM Chandrababu Naidu Guntur Tour , Inaugurates GIS Sub Station


  • అమరావతికి విద్యుత్ సరఫరా కోసం గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌..

  • రాష్ట్రవ్యాప్తంగా ఐదు సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

  • 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన..
Andhra Pradesh: 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభం.. 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన

Andhra Pradesh: రాజధాని అమరావతి ప్రాంతానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. అందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రూ.505 కోట్లతో నిర్మించిన గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ను ప్రారంభించిన సీఎం.. అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు 400/220కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌)ను నిర్మించింది ప్రభుత్వం.. ఇక, తాళ్లాయపాలెంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన తర్వాత సబ్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు.. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు.. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభోత్సవాలు,14 సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు చేశారు సీఎం చంద్రబాబు. రాజధాని గ్రామం తాళ్లాయపాలెం లో సబ్ స్టేషన్ ప్రారంభించిన ఆయన.. వర్చువల్ గా మిగిలిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.. అమరావతిలో భవిష్యత్తులో నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా తాళ్లాయపాలెం లో రాష్ట్రంలోనే మొదటి GIS విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి.. రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో మంత్రి నారాయణను అడిగి తెలుసుకున్నారు.. ఇక, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు జీఐఎస్‌ తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.. తాళ్లాయపాలెం జీఐఎస్‌ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలకు సరఫరా చేయనున్నారు..