Leading News Portal in Telugu

Sri Sathya Sai District SP V. Ratna has warned that strict action will be taken if obscene posts are posted on social media.


  • సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే..

  • ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా..

  • నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై..

  • షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రత్న వార్నింగ్..
Social Media Posts: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే.. ఎస్పీ సీరియస్‌ వార్నింగ్‌..

Social Media Posts: ఇప్పుడు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార కూటమి, ప్రతిపక్షం మధ్య.. సోషల్‌ మీడియాలో వార్‌ నడుస్తోంది.. అయితే, ఇది కొన్నిసార్లు శృతిమించిపోయి.. వ్యక్తిగత జీవితాలపై.. పోస్టుల వరకు వెళ్తోంది.. అయితే, దీనిపై సర్కార్‌ సీరియస్‌గా ఉంది.. ఇక, సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న..

సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారంచేసిన, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు ఎస్పీ రత్న.. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా, వ్యక్తిగత పేరుపైన ఫోటోలు మార్ఫింగ్ చేసిన, మాన అభిమానాలు దెబ్బ తినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా మతపరమైన, సున్నిత అంశాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే.. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై సైబర్ సెల్ సోషల్ మీడియా విభాగం నందు ప్రత్యేక నిఘా ఉంచామని, సదరు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు. అవాస్తవ ప్రచారాలను ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంచామని, నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై, షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ రత్న..