Leading News Portal in Telugu

Notice to the family of former MLA Kethireddy Family over Dharmavaram Cheruvu


  • ధర్మవరం చెరువు కబ్జా..!.
    మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబానికి షాక్‌..

  • కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నోటీసులు..

  • వారం రోజుల్లో ఖాళీ చేయాలని పేర్కొన్న అధికారులు..
Kethireddy Venkatarami Reddy: ధర్మవరం చెరువు కబ్జా..! మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబానికి నోటీసులు..

Kethireddy Venkatarami Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబానికి షాక్‌ ఇచ్చారు అధికారులు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.. ధర్మవరం చెరువును కబ్జా చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.. అయితే, చెరువు స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు నీటిపారుదలశాఖ అధికారులు… కబ్జా చేసిన చెరువు స్థలాన్ని ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు..