Leading News Portal in Telugu

Daggubati Purandeswari said that it was a pleasure to meet the Telugu people in Sydney.


  • సిడ్నీలో తెలుగు కమ్యూనిటీతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశం

  • సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకం- దగ్గుబాటి పురందేశ్వరి

  • కామన్ వెల్త్ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు వారితో సమావేశం

  • అక్కడున్న తెలుగు వారి నుంచి పురందేశ్వరికి అద్భుతమైన స్వాగతం.
Daggubati Purandeswari: సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకం..

సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలుగు కమ్యూనిటీతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. కామన్ వెల్త్ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు వారికి ఆమె సమయం ఇచ్చారు. వారి నుండి పురందేశ్వరికి అద్భుతమైన స్వాగతం లభించింది. ప్రస్తుతం తాము నివసిస్తున్న దేశాలకు ఆర్థికంగా, రాజకీయంగా సానుకూలంగా సహకరిస్తూ మన దేశం, రాష్ట్రం గర్వపడేలా చేసిన తెలుగు జాతికి గర్వకారణం అని పురందేశ్వరి తెలిపారు.

Fake currency: యూట్యూబ్ సాయం.. రూ. 500 నకిలీ నోట్ల ప్రింటింగ్..

జననీ జన్మ భూమిశ్చ స్వర్గ దపి గరియసి..
మాతృభూమికి సేవ చేయడం కంటే గొప్ప స్వర్గం లేదు.. అందుకే వారు నివసించే భూమికి తమ వంతు సహకారం అందించినప్పటికీ, వారు తమ మాతృభూమికి సేవ చేయడం మర్చిపోకూడదని సందర్భోచితంగా పురంధేశ్వరి వారితో మాట్లాడారు. తెలుగు వారితో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కి దగ్గుబాటి పురందేశ్వరి హాజరైన సంగతి తెలిసిందే.. ఈరోజు వరకు కాన్ఫరెన్స్ చర్చల్లో పాల్గొని, 11వ తేదీన స్వదేశానికి ఆమె తిరిగి రానున్నారు.

Kadapa: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్..!