Leading News Portal in Telugu

AP Deputy CM Pawan Kalyan Tweet on Drugs Issue


  • డ్రగ్స్‌ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

  • రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది అంటూ ట్వీట్..
Deputy CM Pawan Kalyan: డ్రగ్స్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ ట్వీట్.. పెనుముప్పుగా మారింది..!

Deputy CM Pawan Kalyan: సోషల్‌ మీడియా వేదికగా డ్రగ్స్‌పై స్పందించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్.. “రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది.. మన ఎన్డీఏ ప్రభుత్వం మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.. కొంతకాలం క్రితం, విశాఖపట్నం పోర్టులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని చూపిస్తుందన్నారు పవన్‌.. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

కాగా, ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం డ్రగ్స్‌తో పాటు గంజాయి కట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే.. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా రాష్ట్రస్థాయిలో యాంటీ నార్కొటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏఎన్‌టీఎఫ్‌), జిల్లాకొకటి చొప్పున మొత్తం 26 నార్కొటిక్స్‌ కంట్రోల్‌ సెల్స్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఉపసంఘం ఆమోదం తెలిపింది. డీజీపీ పర్యవేక్షణలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏఎన్‌టీఎఫ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక, మరోసారి డిప్యూటీ సీఎం డ్రగ్స్‌పై ట్వీట్‌ చేసిన నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం.. తర్వాత డ్రగ్స్‌, గంజాయి కట్టడిపై దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది.