Leading News Portal in Telugu

Union Minister Kinjarapu Ram Mohan Naidu at Seaplane Services Launches


  • దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఏపీ నుంచే ప్రారంభం..

  • కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటులోకి తెస్తాం..

  • టూరిజం కూడా సహకరిస్తే ఇంకా వేగంగా ముందుకు వెళ్తాం..

  • స్పష్టం చేసిన పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు..
Union Minister Ram Mohan Naidu: దేశంలో ఏపీలోనే సీ ప్లేన్‌ తొలిసారి.. ఈ మూడు రూట్లలో సర్వీసులు..

Union Minister Ram Mohan Naidu: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీ ప్లేన్‌ సర్వీసులకు రంగం సిద్ధం చేసింది.. ఇప్పటికే విజయవాడ-శ్రీశైలం మధ్య ట్రయల్‌ రన్‌ విజయవంతం అయ్యింది.. ఈ రోజు లాంఛనంగా ఆ సర్వీసులను ప్రారంభించి శ్రీశైలం వెళ్లలనున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం అన్నారు.. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నాం అన్నారు.. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500 ఎకరాల అవసరం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందన్నారు.. ఉడాన్ స్కీం ద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది.. టూరిజం కూడా సహకరిస్తే ఇంకా వేగంగా ముందుకు వెళ్తాం అన్నారు..

ఇక, ప్రస్తుతానికి విజయవాడ – శ్రీశైలంతో పాటు విజయవాడ – నాగార్జున సాగర్, విజయవాడ – హైదరాబాద్‌ రూట్‌లు కన్ఫర్మ్ అయ్యాయి అని వెల్లడించారు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలో రాజధాని అమరావతికి కనెక్ట్ చేసే విధంగా మరిన్ని స్టేషన్ లు అభివృద్ధి చేస్తాం అన్నారు.. రెగ్యులర్ ట్రావెల్ కు మరో మూడు నాలుగు నెలల సమయం పడుతుందన్నారు.. అయితే, ప్రస్తుతం ఇది ట్రయిల్ మాత్రమే.. ధరలు, ట్రిప్ ల వివరాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.. సీ ప్లేన్ ఆపరేషన్స్ కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతినే మార్చే శక్తి ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చంద్రబాబు సూచన మేరకే పాలసీలో కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చాం.. చంద్రుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నిత్య పున్నమి ఉంటుందని పున్నమి ఘాట్ సాక్షిగా చెబుతున్నా అంటూ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.. అతి చిన్న దేశం మాల్దీవుస్ లో సీ ప్లేన్ ద్వారా చాలా ఆదాయం వస్తుంది.. అలాంటిది 140 కోట్ల జనం, 1350 దీవులు ఉన్న భారత దేశంలో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఒక విప్లవం కానున్నాయన్నారు.. అందుకు అమరావతినే మొదటి వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.