- రవీంద్రరెడ్డికి ప్రాణహాని ఉంది
- ఆయనకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత
- వర్రా రవీంద్ర రెడ్డి భార్య వర్రా కల్యాణి సంచలన వ్యాఖ్యలు
Varra Ravindra Reddy Wife: వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీంద్ర రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇప్పటికీ కోర్టులో ప్రవేశపెట్టకపోవటంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను చంపేందుకు కుట్ర పన్నారని రవీంద్ర భార్య కళ్యాణి భయపడుతున్నారు. రవీంద్రరెడ్డిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే డీజీపి ఆఫీసు ఎదుట కుటుంబమంతా కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.
టీడీపీ కార్యకర్త ఒకరు రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి మహిళలపై పోస్టులు పెట్టారని.. దానిపై రవీంద్ర ఫిర్యాదు చేయటంతో గతంలోనే అతన్ని అరెస్టు కూడా చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే సాకుతో రవీంద్రరెడ్డిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బీటెక్ రవి, పోలీసుల మాటలు చూస్తుంటే మాకు భయమేస్తోందన్నారు. రవీంద్రరెడ్డికి ప్రాణహాని ఉందని.. వర్రా రవీంద్రరెడ్డికి ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ వర్రా కల్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు.