Leading News Portal in Telugu

Minister Parthasarathy review on Housing in Chittoor and Tirupati districts


  • చిత్తూరు..తిరుపతి జిల్లాలో హౌసింగ్‌పై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనేది సీఎం లక్ష్యమని వెల్లడి
Minister Parthasarathy: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం

Minister Parthasarathy: చిత్తూరు, తిరుపతి జిల్లాలో హౌసింగ్‌పై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. పీఎంఈవై మొదటి దశలో లో కేటాయించిన 70శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని మంత్రి పార్థసారధి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని వెల్లడించారు. అందుబాటులో ఉన్న ఇసుక ను హౌసింగ్ డిపార్ట్మెంట్‌కు ఇవ్వాలన్నారు. ఇసుక ట్రాన్స్ఫార్మెంట్ ను హౌసింగ్ విభాగమే చెల్లించేలా అదేశించామని చెప్పారు. హౌసింగ్ నిర్మాణం, కేటాయింపుల్లో అవకతవకలపై జేసీ విచారణకు ఆదేశించామని వెల్లడించారు. కుప్పంలో హౌసింగ్ బోర్డు నిర్మించిన ఇళ్లకు విద్యుత్ శాఖ, రెస్కో సమన్వయంతో పనిచేయాలని సూచించామన్నారు.

హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతులను కేంద్ర పథకాల నిధులతో చేస్తామని మంత్రి వెల్లడించారు. బాధ్యతగా లక్ష్యం పూర్తి చేయాలని అధికారులను అదేశించామని చెప్పారు. బిల్లుల చెల్లింపుకు నిధుల కొరత లేదన్నారు. గత ప్రభుత్వ హయంలో హౌసింగ్‌లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందన్నారు. నివేదిక వచ్చిన వెంటనే బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఎంఈవై 2.0 మార్చి నుంచి ప్రారంభం కానుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.