- ప్రేమ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్
- అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు

Suicide Attempt: పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రేమ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. క్రోసూరుకు చెందిన యువకుడు మస్తాన్ వలి సెల్‌టవర్ ఎక్కగా.. పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. క్రోసూరు గ్రామానికి చెందిన మస్తాన్ వలి అనే యువకుడు సిరిపురం గ్రామానికి చెందిన యువతిని పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. క్రోసూరులో యువతితో కలిసి కాపురం చేస్తు్న్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అతడిని బెదిరించి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఆ యువతిని తనతో పంపిస్తానని హామీ ఇస్తేనే కిందకు దిగుతానని యువకుడు చెబుతున్నాడు.