Leading News Portal in Telugu

Accident: ఆలయానికి వెళ్లివస్తుండగా వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు


Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తిలో గల వైకుంటగిరి అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వస్తుండగా బొలెరో వాహనం బోల్తాపడింది. గంట్యాడ మండలం ఎగువ కొండపర్తి వద్ద వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. వారిని కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 108 వాహనంలో వస్తున్న క్షతగాత్రులలో ఒక యువకుడు మృతి చెందినట్లు తెలిసింది.

Read Also: Vizag KGH: విశాఖ కేజీహెచ్‌లో మిరాకిల్.. చనిపోయిన శిశువులో చలనం! ఆనందంలో తండ్రి