Leading News Portal in Telugu

IAS Officers Transfer in Andhra Pradesh


  • ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
  • ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్
  • సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ
IAS Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన డీ రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. కె.కన్నబాబుకు మున్సిపల్, పట్నాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు ఎండీగా బి.అనిల్ కుమార్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గంధం చంద్రుడును కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. డి.హరితను వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ నీరబ్‌ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.