Leading News Portal in Telugu

Minister BC Janardhan Reddy Fires on YSRCP MLAs for AP Assembly Session


  • ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభకు రావడానికే..

  • వైసీపీ ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుండా పారిపోతున్నారు..

  • సెటైర్లు వేసిన మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి..
BC Janardhan Reddy: ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి రావడానికే.. వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు..!

BC Janardhan Reddy: ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభకు రావడానికే.. కానీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి.. ఇక, గుంతల్లో చిడతల బేరం పేరుతో మీడియాలో కథనాలు వస్తున్నాయి.. గడిచిన ఐదు సంవత్సరాలకే రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు అన్నారు.. 2014 -19 మధ్యలో 11 వేల కోట్లు ఖర్చు చేశాం… కానీ, 2019 – 24 వరకు కేవలం ఏడు వేలకోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్న ఆయన.. అంతేకాదు.. వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శించారు.. 2019 -24 వరకు రాష్ట్ర రోడ్డులపై పక్క రాష్ట్రాల మంత్రులు సైతం జోకులు వేసుకున్న పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు..

ఇక, రహదారులు బాగోలేక ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం కుదేలైంది… అనేకమంది ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు మంత్రి జనార్దన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విధ్వంస పాలనలో పరిశ్రమలు తరలి పోయాయి, పెట్టుబడులు ఆగిపోయాయని విమర్శించారు.. రాష్ట్రంలో పోర్టులను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. గతంలో ప్రభుత్వ వాటాను కూడా వైసీపీ పాలకులు, ప్రైవేటు వ్యక్తులకు, బినామీ కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రహదారుల దుస్థితిపై ప్రజల్లో చర్చ జరిగిందని వెల్లడించారు.. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుండా పారిపోతున్నారు… ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభకు రావడానికే కదా? అని నిలదీశారు మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి..