Leading News Portal in Telugu

boy died dog attack NTR district Jaggaiahpet


  • ఎన్టీఆర్ జి జగ్గయ్యపేటలో ఘోరం

  • కుక్కల దాడి రెండేళ్ల బాలుడి మృతి
NTR district: జగ్గయ్యపేటలో ఘోరం.. కుక్కల దాడి రెండేళ్ల బాలుడి మృతి

కుక్కల మారణహోమానికి మరో బాలుడు బలైపోయాడు. కుక్కల స్వైరవిహారానికి ప్రాణాలు పోతున్నా.. అధికారుల మాత్రం పట్టించుకోవడంలో లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Amaravati: అమరావతి అభివృద్ధి.. ఈ ఏడాది చివరకల్లా రూ.15 వేల కోట్ల రుణం..

జగ్గయపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో 10 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొలాల్లోకి ఈడ్చుకెళ్లిపోయాయి. దీంతో బాలుడు తీవ్రగాయాలు పాలయ్యాడు. వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ్‌కుమార్ ప్రాణాలు వదిలాడు. పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని సార్లు మోరపెట్టుకున్న కనీసం స్పందన లేదంటూ బాలుడి తల్లి తండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఎడ్యుకేషన్ హబ్‌లుగా విజయవాడ, విశాఖ, తిరుపతి..