Leading News Portal in Telugu

Physical Harassment on Minor Girl in Krishna District


  • కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Physical Harassment: మైనర్ బాలికపై అత్యాచారం

Physical Harassment: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను లోబర్చుకుని భయభ్రాంతులకు గురిచేసి కొన్నాళ్ళుగా అదే గ్రామానికి చెందిన పులివర్తి ప్రశాంత్ అలియాస్ ( బన్ను) అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. మైనర్ బాలికకు కడుపునొప్పి రాగా.. తల్లిదండ్రులు హాస్పటల్‌కు తీసుకెళ్లగా వైద్యులు గర్భవతిగా నిర్ధారించారు. విషయం ఏమిటని మైనర్ బాలికను తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని గన్నవరం పోలీసులు కోర్టుకు హాజరపరచనున్నారు. మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు.