Leading News Portal in Telugu

Visakha Seven Hills Nursing Hostel Tragedy: Student Injured in Electric Shock While Escaping


  • విశాఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం
  • పైన ఓయో రూమ్స్ కింద నర్సింగ్ హాస్టల్
  • భద్రత గాలికొదిలేసిన హాస్టల్ యాజమాన్యం
Tragedy : విశాఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం

Tragedy : విశాఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది… పైన ఓయో రూమ్స్ కింద నర్సింగ్ హాస్టల్ పెట్టి భద్రత గాలికొదిలేసారు హాస్టల్ యాజమాన్యం.. అర్దరాత్రి బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి గోడ దూకి బయటకి వెళ్లేందుకు ప్రయత్నించింది విద్యార్థిని.. అర్దరాత్రి 2 గంటల సమయంలో ఫుడ్ తీసుకురమ్మని చెప్పిన విద్యార్థిని గోడ దూకే సమయంలో ట్రాన్స్ ఫార్మర్ పట్టుకుంది.. హై ఓల్టేజ్ కరెంట్ షాక్ కొట్టి 50 శాతం గాయాలు పాలైంది పశ్చిమ బెంగాల్ కు చెందిన స్నేహ దాస్.. మెరుగైన వైద్యం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు… విద్యుత్ షాక్ గాయాలతో విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉంది..

School Bus Caught Fire: స్కూల్ బస్సులో మంటలు.. బస్సులో 16 మంది పిల్లలు

విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు హాస్టల్ యాజమాన్యం ప్రయత్నం చేసింది… 150 మంది విద్యార్థినులు చదువుతున్నా హాస్టల్ లో అసలు సీసీటీవీ లు అమర్చలేదు… విషయం తెలుసుకున్న 4th Town పొలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు… విద్యార్ధినుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు… హాస్టల్ లోకి యువకులు ప్రవేశాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

5 Star Rating Cars: మహీంద్రా మూడు వాహనాలకు 5 స్టార్‌ రేటింగ్‌.. అవేంటో తెలుసా?