Minister Narayana said that Narayana Group will provide support to students of government colleges to get quality education
- ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్..
- పాల్గొని కీలక సూచనలు చేసిన మంత్రి నారాయణ..
- ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు..
- నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడించిన మంత్రి..

Minister Narayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలకు సిద్ధంమైంది.. దీనిపై కీలక సూచనలు చేశారు మంత్రి నారాయణ.. ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై పలు సూచనలు చేశారు నారాయణ .. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని కీలక అంశాలను పంచుకున్నారు.. అంతేకాదు.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడించారు.. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. విజయవాడలో నిర్వహించిన వర్క్ షాప్ కు ఇంటర్ బోర్డు కమిషనర్ ఆర్జెడీలు, ఆర్ఐవోలు, ప్రిన్సిపాల్స్, ఇతర అధ్యాపకులు హాజరయ్యారు.. ఆ వర్క్ షాప్‌లో పాల్గొన్న మంత్రి నారాయణ.. కీలక సూచనలు చేశారు..