Leading News Portal in Telugu

Raghu Ramakrishna Raju Elected as Andhra Pradesh Deputy Speaker Unopposed | Latest News


  • నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నిక, పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.
Raghu Ramakrishna Raju :  ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు

Raghu Ramakrishna Raju : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అయితే.. ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. అలాగే, వీరితో పాటు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Cochin Shipyard Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

కాగా, ఉపసభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఇతర ఏ నామినేషన్‌లు రాకపోతే తన ఎన్నిక ఏకగ్రీవం అవుతుందన్నారు. ఇక, తాజా ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంత‌కు ముందు 2019 ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నిక‌లకు ముందు రఘురామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తెలుగు దేశం పార్టీలో చేరారు.

GAIL Recruitment 2024: గెయిల్ ఇండియాలో 261 పోస్టులు ఖాళీలు.. లక్షల్లో జీతం