Leading News Portal in Telugu

నువ్వు చెప్పింది కరెక్ట్… వైసీపీ ఎంపీకి నాగబాబు కౌంటర్…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు… అవును విజయసాయి నువ్వు చెప్పింది కరెక్ట్ అంటూ కామెంట్ చేశారు. ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసు అని ఘాటుగా విమర్శించారు. మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి.. పవన్‌తో దోస్తీకి రెడి అన్న మీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.