ఇండియన్ మార్కెట్లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ స్పోర్ట్స్ బైక్
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారులలో టీవీఎస్ ఒకటి. టీవీఎస్ మోటార్స్ కంపెనీ తన బ్రాండ్ అయిన బిఎస్-6 స్పోర్ట్‌బైక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది ఈ కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్ ప్రారంభ ధర రూ. 51,750. ఏ కొత్త టీవీఎస్ మోటార్ సైకిల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !
కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి కిక్‌స్టార్ట్ మరియు రెండు సెల్ఫ్ స్టార్ట్ అనే రెండు వేరియంట్లు. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం కిక్‌స్టార్ట్ వేరియంట్ ధర రూ. 51,750 కాగా, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 58,925. ఈ టీవీఎస్ మోటార్స్ యొక్క బిఎస్ 4 వెర్షన్ కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 48,117 , అదే విధంగా సెల్ఫ్ స్టార్ట్ ధర రూ. 50,908. బిఎస్ 4 వేరియంట్ కంటే బిఎస్ 6 వేరియంట్ కొంత ఎక్కువ ధరను కలిగి ఉంది.
కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్‌లో బిఎస్ 6, 109.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 8.17 బిహెచ్పి శక్తి మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
కొత్త టీవీఎస్ స్పోర్ట్‌బైక్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉంటుంది. కొత్త టీవీఎస్ స్పోర్ట్ బైక్ మునుపటి బిఎస్ 4 తో పోలిస్తే 15 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తుంది.
మునుపటి బిఎస్ 4 టివిఎస్ స్పోర్ట్‌బైక్‌లో 99.7 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 7.27 బిహెచ్పి శక్తిని మరియు 7.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో బిఎస్ 6 ఉద్గార నిబంధన ప్రకారం కొత్త ఇంజన్ అమర్చారు. టీవీఎస్ తన కొత్త స్పోర్ట్బైక్లోని ఇంజిన్‌ను మాత్రమే మార్చింది. కానీ ఈ బైక్ రూపకల్పనలో ఎలాంటి మార్పు చేయలేదు.
టీవీఎస్ కి సంబంధించిన ఇతర సమాచారం మేరకు టివిఎస్ మోటార్ మరియు దాని అనుబంధ సంస్థ కరోనాతో పోరాడటానికి మరియు 10 లక్షల ఫేస్ మాస్క్‌లను క్లెయిమ్ చేయడానికి ప్రభుత్వానికి రూ. 30 కోట్ల గ్రాంట్ కూడా ప్రకటించింది.