భారత్‌లో విదుదల కానున్న కొత్త జీప్ కాంపాక్ట్ ఎస్యువి
ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ అయిన జీప్ ఎంట్రీ లెవల్ జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త రెనెగేడ్ ఎస్‌యువిని వచ్చే ఏడాది భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. ఈ కొత్త జీప్ కాంపాక్ట్ ఎస్యువి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !
ఈ కాంపాక్ట్ ఎస్యువి సరికొత్త ఆధునిక టెక్నాలజీని కలిగి ఉంటుందని ఆశించవచ్చు. భవిష్యత్తులో విడుదల కానున్న ఈ జీప్ కాంపాక్ట్ ఎస్‌యువిలో ఆఫ్ రోడ్ అనుకూలత కోసం కంపెనీ ట్రయల్ రేటెడ్ బ్యాడ్జ్ ని కూడా కలిగి ఉంటుంది.
ఈ కొత్త జీప్ కాంపాక్ట్ ఎస్‌యువిని భారతీయ మార్కెట్లో కూడా విడుదల చేయనున్నారు. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు ఆఫ్-రోడ్ లాకింగ్ డిఫరెన్షియల్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్యువి జీప్ బ్రాండ్ ఆఫ్ రోడింగ్ వాహనాల్లో ఒకటిగా చేరనుంది.
త్వరలో విడుదల కానున్న జీప్ కాంపాక్ట్ ఎస్యువి పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యువిని పూర్తిగా ఎలక్ట్రిక్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ వెర్షన్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
భారతదేశంలో మరియు విదేశీ మార్కెట్లలో ఈ జీప్ కాంపాక్ట్ ఎస్‌యువిలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు తరచుగా హ్యాచ్‌బ్యాక్‌ల కంటే కాంపాక్ట్ ఎస్యువిలనే ఇష్టపడతారు. జీప్ సంస్థ ప్రముఖ ఎస్యువి తయారీదారులలో ఒకరు. ఇప్పుడు ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యువిని లాంచ్ చేయడానికి కూడా కంపెనీ సన్నద్ధమవుతోంది.
ఇండియన్ మార్కెట్లో కొత్త జీప్ రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్యువి విడుదలయిన తరువాత ఇది హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ కాంపాక్ట్ వంటి ఎస్‌యువిలకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.