ఎంజి మోటార్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్, ఇంతకీ ఎం చేశారో తెలుసా.. !
కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పది లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ భయంకరమైన వైరస్ వల్ల 50 వేలకు పైగా ప్రజలు చనిపోయారు.
కరోనా వైరస్ భారతదేశంలో కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఎక్కువ మంది ప్రజలు ఈ వైరస్ భారిన పడకుండా ఉండటానికి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయబడింది.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ ఫలితంగా ఆటో మొబైల్ సహా అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి. ఈ కారణంగా ఆటో పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో ఎంజి మోటార్ కంపెనీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎంజి మోటార్ తన కంపెనీ ఉత్పత్తులను నిలిపివేసినప్పటికీ కంపెనీలో పనిచేసే ఏ ఒక్కరిని తొలగించబోమని ప్రకటించింది.
ఎంజీ మోటార్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలని ప్రజలు ఇతర సంస్థలను కూడా కోరుతున్నారు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ లో ఉన్నప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు వేతనం ఇవ్వడం వల్ల ఈ సమయంలో వారికి అండగా ఉన్నట్లు అవుతుంది.
ఎంజీ మోటర్స్ కంపెనీ ఉద్యోగులు ఈ నిర్ణయంతో వల్ల చాలా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ఎంజీ మోటార్ కంపెనీ ఇప్పటికే రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చింది. అదనంగా ఎంజి మోటార్ తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు కూడా తయారు చేస్తుంది.