Leading News Portal in Telugu

Finance Minister: తొమ్మిదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఆదా.. ప్రకటించిన ఆర్థికమంత్రి


Finance Minister: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) ద్వారా గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం డిబిటి ద్వారా వివిధ పథకాల కింద ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో నకిలీ లేదా బోగస్ ఖాతాల ఖాతాల్లోకి ప్రభుత్వ నిధులు వెళ్లకుండా అరికట్టగలిగినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది లీకేజీలను అరికట్టడంలో.. ప్రభుత్వ పథకం నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు మెరుగైన ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడిందని ఎన్జీవో దిశా భారత్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఆర్థిక మంత్రి మాట్లాడారు. డిబిటిని స్వీకరించినప్పటి నుండి దాని ద్వారా ప్రభుత్వ పనితీరు మెరుగుపడిందని.. దాని సహాయంతో విద్య, ఆరోగ్యానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చని అన్నారు.

డీబీటీ ప్రవేశపెట్టడంతో పెన్షన్లు, ఉపాధి హామీ డబ్బు, వడ్డీ రాయితీ, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ బదిలీలు అర్హులైన లబ్ధిదారుల ఆధార్-ధృవీకరించబడిన బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతున్నాయి. అన్ని నకిలీ ఖాతాలు తొలగించబడ్డాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2014 సంవత్సరం నుంచి డీబీటీ కింద పథకాలు పెంచామన్నారు. దీని వల్ల రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేశామని.. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న పోటీ కారణంగా వంటి ముఖ్యమైన సౌకర్యాల ఖర్చు భారీగా తగ్గిందని అన్నారు. 2014లో జీబీకి రూ.308 ఉండగా నేడు జీబీకి రూ.9.94కి తగ్గింది.