50,000 Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం పాకులాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు.. చవువును పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వేట మొదలుపెడుతున్నారు.. అయితే, నిరుద్యోగులకు శుభవార్త.. పూర్తి స్థాయి ఉద్యోగాలు కాకపోయినా.. ఈ ఏడాది ద్వితీయార్థంలో 50 వేలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.. పండుగల సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.. ఇక, ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ , క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ వంటి రంగాల్లో ఉద్యోగాల పెరుగుదలను ఆశిస్తున్నాయి. వీటి వల్ల కొత్త ఉద్యోగాలు భారీ సంఖ్యలు సృష్టిస్తారని.. నివేదికలు చెబుతున్నాయి.
తాజా నివేదికల ప్రకారం.. ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు అంచనాలున్నాయి.. ఆయా సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయని.. గత ఏడాదికంటే ఈ సంవత్సరం ఆయా రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరుగుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. స్టాఫింగ్ కంపెనీ టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఈ క్యాలెండర్ ఇయర్ రెండవ సగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో దాదాపు 50,000 తాత్కాలిక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. BFSI రంగం ఇప్పటికే క్రెడిట్ కార్డ్ అమ్మకాలు, వ్యక్తిగత ఫైనాన్స్, రిటైల్ భీమా, పెరిగిన వినియోగదారుల వ్యయం మరియు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం కారణంగా గణనీయమైన పెరుగుదలను చూస్తోంది.
2023 ద్వితీయార్థంలో సుమారు 50,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేయబడింది, ఎందుకంటే BFSI సంస్థలు పెరిగిన ఫైనాన్స్ ఉత్పత్తుల ఎదుర్కోవటానికి తమ శ్రామిక శక్తిని పెంచడానికి సిద్ధపడుతున్నాయని పేర్కొంది.. క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరగడం, పర్సనల్ ఫైనాన్స్ అప్లికేషన్లు పెరగటమే కాకుండా రాబోయే 5 లేదా 6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్‌కు సిద్ధంగా ఉన్నామని టీమ్‌లీజ్ సర్వీస్ తెలిపింది.. పండుగ సీజన్‌లో తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ అహ్మదాబాద్, పుణె, బెంగళూరు, కోల్‌కతా వంటి సిటీల్లో మాత్రమే కాకుండా.. కొచ్చి, వైజాగ్, మధురై, లక్నో, చండీగఢ్, అమృత్‌సర్, భోపాల్, రాయ్‌పూర్ లాంటి నగరాల్లో కూడా ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
రాబోయే 5-6 నెలల్లో డైనమిక్ జాబ్ మార్కెట్ కోసం మేము సిద్ధంగా ఉన్నాం. గత నెల నుండి, మేం తాత్కాలిక సిబ్బంది కోసం దాదాపు 25,000 ఉద్యోగ అవకాశాలను చూశాం.. ఇక, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సంఖ్యలు 50,000కి పెరుగుతాయని మేము అంచనా వేస్తున్నాం అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ మరియు బిజినెస్ హెడ్, BFSI, కృష్ణేందు ఛటర్జీ అన్నారు. ఇంతకుముందు, ఈ అవకాశాలు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ, ఈ-కామర్స్, రిటైల్ రుణాలు, బీమా సేవల విస్తరణ అహ్మదాబాద్, సూరత్, నాసిక్ మరియు కాన్పూర్ వంటి నగరాలకు కూడా విస్తరించాయన్నారు.. ఈ తాత్కాలిక ఉద్యోగుల ఆదాయం మునుపటి ఏడాదికంటే 7 నుంచి 10 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన సిటీల్లో ఉద్యోగులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు జీతం ఉంటుందని.. ఇక, చెన్నైలో రూ. 15వేల నుంచి రూ. 17వేల వరకు, కోల్‌కతాలో రూ. 13వేల నుంచి రూ. 15వేల వరకు ఉంటుందనే అంచనాలున్నాయి.. ఈ-కామర్స్, రిటైల్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ మరియు స్మార్ట్‌ఫోన్‌లు వంటి రంగాలకు ఉత్సాహభరితమైన పండుగల సీజన్‌ను అంచనా వేస్తూ, క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు మరియు బీమా ఉత్పత్తులకు డిమాండ్ ఊపందుకోవచ్చని అంచనా వేస్తున్నారు.