Leading News Portal in Telugu

Air India Sale: డెడ్ ఛీప్‎గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ టిక్కెట్లు.. కేవలం రూ. 1470కే


Air India Sale: ఇప్పటి వరకు విమానయానం అంటే సంపన్నలకు మాత్రమే సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు. కానీ విమానయాన సంస్థలు సామాన్యులను కూడా విమానంలో ప్రయాణించేలా చేయాలని సాధ్యమైనంత వరకు కృష్టి చేస్తున్నాయి. మీరు కూడా విమానంలో (ఎయిర్ ఇండియా) ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నట్లైతే మీకో శుభవార్త. స్పైస్‌జెట్ తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు చౌకగా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఎయిర్ ఇండియా ద్వారా ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇందులో మీరు టిక్కెట్ బుకింగ్‌పై 30శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా తెలియజేసింది.

మీకు ఇష్టమైన గమ్యస్థానానికి విమానంలో ప్రయాణించవచ్చని ఎయిర్ ఇండియా తన అధికారిక ట్వీట్‌లో రాసింది. దీనితో పాటు మీరు విమాన టిక్కెట్లపై 30శాతం తగ్గింపు పొందుతారు. మీరు ఈ ఆఫర్‌లో ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. దీని కోసం మీరు అన్ని నిబంధనలు, షరతులను తెలుసుకోవాలి.

దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కంపెనీ 96 గంటల విక్రయాన్ని ప్రారంభించింది. ఇందులో ఎకానమీ క్లాస్ కోసం ప్రయాణికులు రూ.1470కి బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు బిజినెస్ క్లాస్ టికెట్ బుకింగ్ రూ.10,130 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ ఆఫర్ కింద ఆగస్టు 17 నుండి ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆఫర్ కింద టిక్కెట్ల బుకింగ్‌పై 1 సెప్టెంబర్ 2023 నుండి 31 అక్టోబర్ 2023 వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్‌జెట్ కూడా ఈ సమయంలో టిక్కెట్లను చౌకగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. స్పైస్‌జెట్ ప్రయాణీకుల కోసం ఇండిపెండెన్స్ డే సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు కేవలం రూ.1515తో మీ విమాన ప్రయాణ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కింద కూడా మీరు ఆగస్టు 20 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ టిక్కెట్ మొత్తంలో అన్ని పన్నులు చేర్చబడ్డాయి. దీంతో కేవలం రూ.15కే ఇష్టమైన సీటును ఎంచుకోవచ్చు. దీనితో పాటు రూ.2000 టికెట్ వోచర్ కూడా లభిస్తుంది.