Leading News Portal in Telugu

Tax Benefit: ఉద్యోగులకు శుభవార్త.. మారిన రూల్స్‌.. పన్ను ఆదా..


Tax Benefit: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను నిబంధనలను సవరించింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఒక సంస్థ తన ఉద్యోగులకు అందించే అద్దె రహిత వసతిని మదింపు చేసే నిబంధనలను మార్చింది. దీనితో, మంచి వేతనాలు పొంది, యజమాని సంస్థ అందించే అద్దె రహిత వసతిలో నివసించే కార్మికులు ఇప్పుడు మరింత పొదుపు చేసుకునే అవకాశం ఉంది. దీంతో, ఎక్కువ నగదును జీతంగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది.. నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు కేవలం వసతి నిమిత్తం అందించబడి.

గతంలో.. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న సిటీల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను రాయితీ వారి జీతంలో 10 శాతంగా ఉంది.. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉంటూ వచ్చింది. మరోవైపు.. 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది.. గతంలో 10 శాతంగా ఉండేదని సీబీడీటీ పేర్కొంది. AKM గ్లోబల్ టాక్స్ పార్టనర్ అమిత్ మహేశ్వరి మాట్లాడుతూ, యజమాని నుండి తగిన జీతం మరియు వసతి పొందుతున్న ఉద్యోగులు తమ పన్ను పరిధిలోకి వచ్చే బేస్ ఇప్పుడు సవరించిన రేట్లతో తగ్గించబోతున్నందున మరింత ఆదా చేసుకోగలుగుతారని తెలిపారు.

దీనిపై AMRG అండ్‌ అసోసియేట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ మోహన్ మాట్లాడుతూ, ఈ నిబంధనలు 2011 జనాభా లెక్కల డేటాను పొందుపరిచాయని, అవసరమైన విలువ గణనను హేతుబద్ధీకరించే లక్ష్యంతో ఉన్నాయని వెల్లడించారు.. అద్దె రహిత వసతి పొందే కార్మికులకు పన్ను విధించదగిన జీతం తగ్గుతుందని.. తద్వారా నికర టేక్-హోమ్ పే పెరుగుతుంది అని గౌరవ్‌ మోహన్‌ పేర్కొన్నారు.