ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన స్కీమ్ లన్ని కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్‌లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ పథకం గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్‌ను ఎన్‌పీఎస్ అని కూడా పిలుస్తారు. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు.. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
ఎన్‌పీఎస్ అకౌంట్‌ను మీ భార్య పేరుపై కూడా ఓపెన్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఆమెకు ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది. ఒకే సారి భారీ మొత్తం వస్తుంది. ఇలా చాలా బెనిఫిట్ పొందొచ్చు. సాధారణంగా అయితే ఎన్‌పీఎస్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 60 ఏళ్లు. అంటే ఆమెకు 60 ఏళ్లు వచ్చినప్పుడు ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. అలాగు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం అయితే అమెకు 65 ఏళ్లు వచ్చే వరకు కూడా ఎన్‌పీఎస్ అకౌంట్‌ను కొనసాగించొచ్చు..
ఉదాహరణకు నెలకు రూ. 5 వేలు కడుతున్నారని అనుకుందాం. రాబడి 12 శాతంగా పరిగణలోకి తీసుకుంటే ఆమెకు 60 ఏళ్లు వచ్చినప్పుడు పెన్షన్ ఫండ్ మొత్తం విలువ రూ. 1.76 కోట్లు అవుతుంది. ఇందులో కనీసం 60 శాతం మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే రూ.కోటికి పైగా పొందొచ్చు. మిగతా 40 శాతం మొత్తంతో అంటే రూ.70 లక్షలు పెట్టి యాన్యుటీ ప్లాన్ కొనాలి. ఇక్కడ యాన్యుటీ రేటు 8 శాతంగా ఉంటే నెలకు మీకు రూ. 47 వేల పెన్షన్ ను పొందవచ్చు.. మీరు ఎంత మొత్తం అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. కనీసం రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి ఉంటుందని మర్చిపోకండి.. పెన్షన్ కూడా పెరుగుతుంది..