బిజినెస్ చెయ్యాలి.. డబ్బులను దాచుకోవాలని అందరు అనుకుంటారు.. కానీ బిజినెస్ లోకి దిగాలంటే ఎటువంటి బిజినెస్ చేస్తే బిజినెస్ చెయ్యాలా అని ఆలోచిస్తారు.. అలాంటి వారి కోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.. అదేంటో ఒక లుక్ వేసుకోండి..
తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఉంటాయి. అలాంటి వారు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అనుబంధ వాహన వ్యాపారాల ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ వెంచర్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు చక్కగా సరిపోతుంది. తక్కువ ఇనీషియల్ క్యాపిటల్‌తో స్టార్ట్ చేయవచ్చు… ఈరోజుల్లో కాలుష్యాల వల్లో లేక ఫ్యామిలీ కోసమో చాలా మంది కారును తీసుకోవాలని అనుకుంటారు.. కారు డీటైలింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేయడం మంచి ఆలోచన. కేవలం రూ.1 లక్ష పెట్టుబడితో వెంచర్ మొదలుపెట్టవచ్చు. ఈ బిజినెస్‌కు చాలా తక్కువ ఇన్వెంటరీ అవసరం అవుతుంది. దీంతో రీస్టాకింగ్ సమస్యలు ఉండవు.
అంతేకాకుండా కార్ డీటైలింగ్ వర్క్‌షాప్‌లు, ఆటోమొబైల్ డీలర్‌షిప్‌లతో ఒప్పందాలు పొందవచ్చు. వీటితో స్థిరమైన ఆదాయం అందుతుంది. స్పెషలైజ్డ్ సర్వీసెస్ కోసం వర్క్‌షాప్‌కు తగిన సంఖ్యలో కార్లు వస్తే, కారు డిటైలింగ్ బిజినెస్‌లో లాభాలు నెలకు రెండు లక్షలకు పైగా ఉంటాయి.. అద్దె ఖర్చులు కూడా తీసేయ్యాలి.. జాక్‌లు, కార్ మౌంటింగ్‌లు, వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్, క్లాత్స్ డ్రైయర్, హెవీ-డ్యూటీ టూల్ సెట్, మినీ కంప్రెసర్ జెట్, 1 హార్స్‌పవర్ వాటర్ మోటార్ , అవసరమైన పైపింగ్ సెటప్ మొదట అవసరం అవుతాయి.. డ్రై క్లీనింగ్ సర్వీస్‌కి ఒక్కో కారుకు రూ.2,000 నుంచి రూ.4,000 మధ్య ఖర్చవుతాయి. ప్రతిరోజూ సగటున 3 నుంచి 4 కార్లు ఈ సర్వీసును పొందినా.. నెలకు సుమారుగా 120 కార్లు అవుతాయి. ఒక్కో కారుకు యావరేజ్‌గా రూ.3,000 ఛార్జ్ చేస్తే.. సంపాదన నెలకు దాదాపు రూ.3.20 లక్షలు అవుతుంది.. ఎటు లేదనుకున్నా 2 లక్షలను నెలకు తీయ్యొచ్చు.. నష్టం లేదు కాబట్టి ఈ బిజినెస్ ను ఎవరైనా మొదలు పెట్టొచ్చు..