Leading News Portal in Telugu

Mukesh Ambani: డిసెంబర్ నాటికి దేశమంతా జియో 5జీ.. “జియో ఎయిర్ ఫైబర్” లాంచింగ్ డేట్ ఫిక్స్..


Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ ఏజీఎం సమావేశంలో భవిష్యత్ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 96 శాతం పట్టణాల్లో జనాభాకు జియో 5జీ అందుబాటులో ఉందని.. డిసెంబర్ చివరినాటికి భారతదేశం అంతటా 5జీ అందుబాటులోకి తీసుకువచ్చేలా లక్ష్యం పెట్టుకున్నామని ప్రకటించారు.

ఈ రోజు ముంబైలో రిలయన్ ఏజీఎం 46వ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీ మాట్లాడుతూ.. జియో 5జీకి సంబంధించిన అప్డేట్స్ ప్రకటించారు. డిసెంబర్ నాటికి 5జీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు. జియో ఎయిర్ ఫైబర్, వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలు సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి రోజున ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

గతేడాది అక్టోబర్ లో రిలయన్ జియో 5జీ నెట్వర్క్ ని ప్రారంభించింది. అయితే ఈ రోజు జరిగిన ఏజీఎం సమావేశంలో 5జీ ప్లాన్స్ ప్రకటిస్తారని అంతా అనుకున్నప్పటికీ.. డిసెంబర్ లో ఫ్లాన్స్ అందుబాటులోకి వస్తాయని ముకేష్ అంబానీ వెల్లడించారు. కేవలం 9 నెలల్లోనే దేశంలోని 96 శాతం పట్టణ జనాభాకు జియో 5జీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదే అత్యంత వేగవంతమైన 5జీ విస్తరణ అని పేర్కొన్నారు.

అదనపు మూలధన వ్యయం లేకుండా జియో తన ప్రస్తుత 4జీ కస్టమర్ బేస్ ను సజావుగా 5జీగా మార్చడానికి మంచి స్థితిలో ఉందని ముకేష్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం జియో 5జీ విస్తరణ సొంతగా, దేశీయంగా అభివృద్ధి చేయబడిన 5జీ స్టాక్ పై ఆధారపడి ఉందని తెలిపారు. భారతదేశ 5G విప్లవంలో జియోను తిరుగులేని నాయకుడిగా ఉందన్నారు.