Leading News Portal in Telugu

Vivo V29e: మార్కెట్లోకి వివో వీ29ఈ.. సెల్ఫీ కెమెరా అదిరిపోయింది..!


వివో కంపెనీ నుంచి తక్కువ ధరలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయింది. ఈ స్మార్ట్ ఫోన్ లో కెమేరా క్వాలిటీ ఎంతో బాగుంది. ఫొటోలకు ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ను రూపొందించినట్టు ఫీచర్లు చూస్తే అర్థమవుతుంది. మార్కెట్లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999గా ఉంది.

ఈ ఫోన్ కలర్ విషయానికొస్తే.. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు, వివో పోర్టల్, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. స్లీక్ డిజైన్ తో తయారు చేయగా.. 7.57 శాతం ఎంఎం మందంతో ఉంటుంది. అంతేకాకుండా డిస్ ప్లే విషయానికొస్తే.. 6.73 అంగుళాల అమోలెడ్డిస్ ఫుల్ హెచ్ డీ ప్లే కలిగి ఉంది. ముఖ్యంగా సెల్ఫీల కోసం 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఐ ఆటో ఫోకస్ ఫీచర్ తో ఉండడం వల్ల సెల్ఫీలు క్లారిటీగా వస్తాయని సంస్థ ప్రకటించింది.

వివో వీ29ఈ వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో డ్యుయల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. దాంతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంటుంది. రెండో కెమెరా 8 మెగాపిక్సల్ తో వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉండగా.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ అడాప్టర్ తో చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్ బాక్స్ తోపాటు ఈ అడాప్టర్ కూడా వస్తుంది. 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్, ఎఫ్ ఎం రేడియో, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మద్దతు ఉంటుంది.