Leading News Portal in Telugu

BSNL Recharge Plan 2023: 397కే 150 రోజుల వ్యాలిడిటీ.. 2GB డైలీ డేటా, అపరిమిత కాలింగ్!


Get 2 GB Daily Data and Unlimited Calls in BSNL Rs 397 Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లను ఆకర్షించడానికి నిత్యం సరికొత్త ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం టెలికాం రంగంను ఏలుతున్న ఎయిర్‌టెల్‌, జియోలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 397తో 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది.

తన కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 397 బెస్ట్ ప్లాన్‌ను తాజాగా తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులు. అంటే 5 నెలలు. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లకు ప్రతిరోజు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, ప్రతిరోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్రయోజనాలు కేవలం 30 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ రీఛార్జ్ వాలిడిటీ మాత్రం 150 రోజుల పాటు కొనసాగుతుంది. ఇంత తక్కువ ధరలో ఇంత చెల్లుబాటు ప్లాన్ మరేదాంట్లో లేదనే చెప్పాలి.

రెండు సిమ్‌లు వాడుతున్న వారికి బీఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ సిమ్ వ్యాలిడిటీని ఎక్కువకాలం పొడిగించుకోవడం కోసం ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. లేదా ఎక్కువ డేటా, కాలింగ్ అవసరం లేకపోతే.. మీరు ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేయవచ్చు. 150 రోజుల వ్యాలిడిటీ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కంటే ఇతర టెలికాం సంస్థల రీఛార్జ్ ఎక్కువగానే ఉన్నాయి.