ATF Price Hike: కొత్త నెల ప్రారంభం అయింది. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సర్వ సాధారణం. అదే విధంగా సెప్టెంబర్ 1 నుండి, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దాని ధరలలో 18 శాతం భారీ పెరుగుదలతో కొత్త రేట్లు అమలు చేయబడ్డాయి. పండుగ సీజన్లో విమానంలో ప్రయాణించబోతున్నట్లయితే.. ప్రస్తుతం గతం కంటే ఎక్కువ డబ్బులు విమాన టిక్కెట్లను కొనుక్కునేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విమాన ఇంధనం ధర కారణంగా విమానయాన సంస్థలు తమ విమాన టిక్కెట్ల ధరలను కూడా పెంచవలసి ఉంటుంది.
ఏటీఎఫ్ ధరలు ఎంత పెరిగాయి?
దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్(వెయ్యి లీటర్లు) రూ.20,295.2కి పెరగగా, దాని ధర రూ.1.12 లక్షలు దాటింది. ఢిల్లీలో విమాన ఇంధనం లేదా జెట్ ఇంధనం ధరలు కిలోలీటర్‌కు రూ.1,12,419.33కి పెరిగాయి.
వరుసగా మూడో నెల పెరిగిన ఏటీఎఫ్ ధరలు
ఢిల్లీ నుండి ముంబై, చెన్నై, కోల్‌కతా వరకు ప్రతిచోటా ఏటీఎఫ్ ధరలో భారీ పెరుగుదల ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏటీఎఫ్ ధరను పెంచడం ఇది వరుసగా మూడవ నెల. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం విమానాలు, జెట్లను నడపడానికి ఉపయోగించే ఇంధనం అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఇంధనం ఈ ధరలు పేర్కొనబడ్డాయి.
నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో ఏటీఎఫ్ కొత్త, పాత ధరలు
ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో గత నెలలో కిలోలీటర్‌కు రూ.92,124.13గా ఉన్న ఏటీఎఫ్ ధర రూ.1,12,419.33కి పెరిగింది.
ముంబై
ఆర్థిక రాజధాని ముంబైలో గతంలో రూ.92,124.13గా ఉన్న ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.1,05,222.13కి పెరిగింది.
కోల్‌కతా
కోల్‌కతాలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.1,21,063.83కి పెరిగింది. గతంలో కిలోలీటర్ రూ.1,07,383.08గా ఉంది.
చెన్నై
చెన్నైలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.1,16,581.77కి పెరిగింది. దీని మునుపటి ధర కిలోలీటరు రూ.1,02,391.64.